వాయిదాపడేలా ఉన్న నాని ‘అ !’

వాయిదాపడేలా ఉన్న నాని ‘అ !’

Published on Jan 19, 2018 5:40 PM IST


వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అ!’. చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుని విడుదలతేదీని కూడా ప్రటించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ తేదీ కాస్త వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.

కొత్త విడుదల తేదీ ఫిబ్రవరి 16వ లేదా 23గా ఉండొచ్చని వినికిడి. ఈ విషయంఫై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, రెజినా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ వంటి నటీనటులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు