నాని ‘భలే భలే మగాడివోయ్’ సెన్సార్ డీటైల్స్

నాని ‘భలే భలే మగాడివోయ్’ సెన్సార్ డీటైల్స్

Published on Aug 27, 2015 2:21 PM IST

Bhale-Bhale-Magadivoy
చిన్న బడ్జెట్ తో సూపర్ క్వాలిటీ ఉండేలా సూపర్ హిట్ సినిమాలు తీసి తన సత్తా చాటుకున్న యంగ్ డైరెక్టర్ మారుతి మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ఫ్యామిలీలో ఒకడుగుగా కలిసిపోయిన యంగ్ హీరో నానితో కలిసి చేసిన సినిమా ‘భలే భలే మగాడివోయ్’. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. ఈ రోజు ఉదయం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుందని తెలియజేశాం. కొద్ది సేపటి క్రితమే సెన్సార్ వారు ఈ సినిమాని చూసారు. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సరిఫికేట్ ఇచ్చారు.

సెన్సార్ వారు ఈ సినిమాకి ఎలాంటి కట్స్ చెప్పకుండా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగిన సినిమా అని క్లీన్ ‘యు’ ఇచ్చారని ఈ చిత్ర టీం తెలిపింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా చివర్లో మనల్ని థ్రిల్ చేసే అంశం కూడా ఉండనుండడం విశేషం. సెప్టెంబర్ 4న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. యంగ్ హీరో నాని ఈ సినిమాలో మతిమరపు రాజాగా కనిపించి టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకూ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టనున్నాడు. నాని సరసన లావణ్య త్రిపాట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ బ్యానర్ వారు కలిసి నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు