‘కృష్ణగాడి..’ కారుకీ ఓ ప్రత్యేకత ఉందట..!

‘కృష్ణగాడి..’ కారుకీ ఓ ప్రత్యేకత ఉందట..!

Published on Feb 7, 2016 11:03 AM IST

krishna-gadi-veera-prema-ga

న్యాచురల్ స్టార్ నాని, ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడిల కాంబినేషన్‌లో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. 14 రీల్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 12న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ట్రైలర్, ఆడియో, పోస్టర్స్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ప్రమోషన్స్ పరంగానూ వినూత్నంగా ఆకట్టుకుంటూ వెళుతోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు హను, ఈ సినిమాలో ఓ ప్రత్యేక నేపథ్యంలో వచ్చే కారుకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

1959 కాలానికి చెందిన ఈ డాడ్జ్ సీ రెడ్ కలర్ కారు కోసం 14 రీల్స్ టీమ్ సుమారు 6 నెలల పాటు వెతికిందట. మైసూరుకు చెందిన ఓ రాయల్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఈ కారును 14 రీల్స్ టీమ్ వెతికిపట్టింది. ఆ తర్వాత అమెరికాలో దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ తెప్పించి పూర్తిగా వాడకంలోకి తెచ్చారట. సినిమాలో ఈ కారు ఓ కీ రోల్ పోషిస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మరి ఒక కారు కోసం ఏకంగా 6నెలలు ఎదురుచూశారంటే అందులో విశేషం ఏముందో తెలియాలంటే మరో ఐదు రోజు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు