నాని ‘వీర ప్రేమగాథ’ సెన్సార్ డీటైల్స్

నాని ‘వీర ప్రేమగాథ’ సెన్సార్ డీటైల్స్

Published on Feb 9, 2016 6:38 PM IST

krishna-gadi-prema-gadha
‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న నాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న తదుపరి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ రోజు మధ్యాహ్నం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో సినిమాకి సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తవడంతో ఇక ప్రింట్స్ ని డిస్పాచ్ చేసే పనిలో పడ్డాడు.

ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేమికుల రోజు కానుకగా వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమైంది. గత 10 రోజులుగా ఈ చిత్ర టీం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి, అలాగే ట్రైలర్స్ కి సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ లో సినిమాకి మంచి క్రేజ్ ఉంది. పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో నాని నుంచి ఆశించే కామెడీ పుష్కలంగా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు