2 మిలియన్ క్లబ్‌లో చేరిన ‘నాన్నకు ప్రేమతో’

2 మిలియన్ క్లబ్‌లో చేరిన ‘నాన్నకు ప్రేమతో’

Published on Feb 5, 2016 8:23 AM IST

nannaku-prematho1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్‌తో హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామా ఎన్టీఆర్‌ కెరీర్‌లో 50 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. చాలాకాలంగా టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్‌కు సాధ్యపడని 50 కోట్ల మార్క్ ‘నాన్నకు ప్రేమతో’తో సాధ్యమైంది.

ఇక ఇదిలా ఉంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సంచలనమే సృష్టించింది. తెలుగులో యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ సినిమాల తర్వాత మూడో స్థానాన్ని సొంతం చేసుకున్న ‘నాన్నకు ప్రేమతో’, నేటితో సరిగ్గా 2 మిలియన్ మార్క్‌ను దాటేసింది. ఇక ఇప్పటికే టాప్ 3లో చోటు సంపాదించుకున్న సినిమా, 2 మిలియన్ కూడా కొట్టడం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. మొదట్లో ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం ఆసక్తికర అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు