ఎన్.టి.ఆర్ ప్రయాణం దసరా తర్వాతేనట.!

ఎన్.టి.ఆర్ ప్రయాణం దసరా తర్వాతేనట.!

Published on Oct 5, 2015 8:00 PM IST

NTR-Nanaku-prematho
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న క్లాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ జూలై నుంచి లండన్ లో షూటింగ్ మొదలు పెట్టి నిరవధికగా 80 రోజులు షూటింగ్లో పాల్గొని ఇటీవలే ఇండియాకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కాస్త క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ తోనే దాదాపు 70% షూటింగ్ ఫినిష్ చేసిన ఈ చిత్ర టీం అవుట్ పుట్ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు.

ఒక మూడు వారాలు షార్ట్ గ్యాప్ తీసుకొని వచ్చిన ఎన్.టి.ఆర్ ఇప్పుడు ఆ గ్యాప్ ని పొడిగించారు. ముందుగా అక్టోబర్ 10న తదుపరి షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళాలనుకున్నారు. కానీ తేదీని మార్చి 15న వెళ్ళాలనుకున్నారు. కానీ తాజాగా ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చారు. తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ దసరా చూసుకొని అక్టోబర్ 24న ఇక్కడి నుంచి స్పెయిన్ కి వెళ్లనున్నాడు. ఈ లాంగ్ స్పెయిన్ షెడ్యూల్ తో నాన్నకు ప్రేమతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న చిన్న చిన్న బిట్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తారు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2016 జనవరి 8న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు