స్పెయిన్ చెక్కేసిన ఎన్.టి.ఆర్ టీం

స్పెయిన్ చెక్కేసిన ఎన్.టి.ఆర్ టీం

Published on Nov 29, 2015 9:44 PM IST

Nannaku-Prematho
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడవ జెనరేషన్ యంగ్ హీరోస్ లో స్టార్డంతో పాటు, స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్న హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఇప్పటి వరకూ 24 సినిమాల్లో నటించిన ఎన్.టి.ఆర్ చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర టీం హైదరాబాద్ లో షూటింగ్ చేసి ఓ షెడ్యూల్ ని ఫినిష్ చేసారు. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఎన్.టి.అర్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని కూడా షూట్ చేసారు.

ఈ చిత్ర టీం ఓ మేజర్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళాల్సింది. గత కొద్ది రోజులుగా వెనక్కి జరుపుకుంటూ వచ్చిన ఈ షెడ్యూల్ ని ఎట్టకేలకు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే సుకుమార్ టీం స్పెయిన్ చేరుకుంది. ఎన్.టి.ఆర్ కూడా బయలుదేరి వెళ్లనున్నాడు.డిసెంబర్ 1 నుంచి అక్కడ రెగ్యులర్ గా షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్ చివర్లో సినిమా ఆడియోని రిలీజ్ చేసి సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఎన్.టి.ఆర్ అవుట్ అండ్ అవుట్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు