ప్రభాస్ కి నారా లోకేష్ శుభాకాంక్షలు !

ప్రభాస్ కి నారా లోకేష్ శుభాకాంక్షలు !

Published on Oct 23, 2019 4:10 PM IST

బాహుబలి సినిమాతోనేషనల్ స్టార్ అయిపోయూడు రెబల్ స్టార్ ప్రభాస్. కాగా నేడు ప్రభాస్ తన 40 వ పుట్టినరోజును లండన్ లో చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సన్నిహితులు మరియు బాహుబలి టీమ్ అందరూ లండన్‌ కి వెళ్లారు. వారితో కలిసి ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. కాగా ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు, ఇటీ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ప్రభాస్‌ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రభాస్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని మంచి చిత్రాలలో నటించి, ప్రజలని ఆనందపరచాలని కోరుకుంటున్నానని’ లోకేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు