ట్రైలర్ : నారా రోహిత్ మరో ఇంటరెస్టింగ్ సినిమా!

ట్రైలర్ : నారా రోహిత్ మరో ఇంటరెస్టింగ్ సినిమా!

Published on Dec 6, 2016 12:05 AM IST

nara-rohith
నారా రోహిత్ నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమా మొదట్నుంచీ ఒక ప్రత్యేక సినిమాగా ప్రచారం పొందుతూ మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. టీజర్, పోస్టర్స్‌తో ఇప్పటికే మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా నేడు విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్‌ను కట్ చేసిన స్టైల్ చాలా కొత్తగా ఉంది. 1990వ దశకంలో హైద్రాబాద్‍లోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన నిజ జీవిత వ్యక్తుల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు.

నారా రోహిత్ ఈ సినిమాలో ఓ ముస్లిం వ్యక్తిగా కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆయన లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నారా రోహిత్‌కు సమానమైన పాత్రలో నటించిన శ్రీ విష్ణు కూడా ఈ ట్రైలర్‌లో బాగా ఆకట్టుకుంటున్నారు. “నిన్ను, నీ అక్కను, నీ బావను, వాడి మెంటల్ సైన్యం మొత్తాన్నీ నాశనం చేస్తా” అంటూ నారా రోహిత్ చెప్పే డైలాగ్, “ఏ బాత్ లిక్‌లేనా భాయ్.. కుదాఫిస్” అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్స్‌తో పూర్తయ్యే ఈ ట్రైలర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో పరిచయం చేశారు. అయ్యారే సినిమాతో మెప్పించిన దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు