జనవరి చివర్లో నారా రోహిత్ ‘పండగలా వచ్చాడు’

జనవరి చివర్లో నారా రోహిత్ ‘పండగలా వచ్చాడు’

Published on Nov 25, 2014 1:12 PM IST

nara-rohit
గత శుక్రవారం ‘రౌడీ ఫెలో’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్ అప్పుడే మరో సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. నారా రోహిత్ తదుపరి సినిమాకి ‘పండగలా వచ్చాడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా అప్పుడే చివరి దశకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఒక వారం రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది.

నారా రోహిత్ సరసన ‘యాక్షన్ 3డి’ ఫేం నీలం ఉపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కార్తికేయ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఇది కాకుండా నారా రోహిత్ నటించిన ‘శంకర’ కూడా విడుదలకి సిద్దమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు