సాంగ్ షూట్లో ‘సావిత్రి’ని బిజీ చేసిన నారా రోహిత్

సాంగ్ షూట్లో ‘సావిత్రి’ని బిజీ చేసిన నారా రోహిత్

Published on Nov 24, 2015 12:02 PM IST

nara_rohith
సినిమా సినిమాకి ఏదో ఒక సరికొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతని ఎర్పరుచుకుంటున్న హీరో నారా రోహిత్. నారా రోహిత్ శరవేగంగా సినిమాలను ఫినిష్ చేస్తూనే వరుసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్న హీరో నారా రోహిత్. ఇటీవలే తుంటరి సినిమా ఫినిష్ చేసిన నారా రోహిత్ రాజా చెయ్యివేస్తే మరియు ‘సావిత్రి’ సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ ‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో చేస్తున్న ‘సావిత్రి’ షూట్ లో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఈనెల 18వ తేదీ నుంచి ఏలూరుప పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఈ చిత్ర టీం దెందులూరు ప్రాంతంలో నార రోహిత్ పై వచ్చే ఓ పాటని షూట్ చేస్తున్నారు. గణేష్ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ షూట్ లో హీరోయిన్ నందిత కూడా పాల్గొంటోంది. ఓ థ్రిల్లర్ కథాంశంతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉండేలా ప్లాన్ చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ విబి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ స్లిమ్ అండ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు