శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నారా రోహిత్ కొత్త చిత్రం !

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నారా రోహిత్ కొత్త చిత్రం !

Published on Apr 23, 2017 5:58 PM IST


2016వ సంవత్సరంలో వరుస సినిమాలతో సందడి చేసిన నారా రోహిత్ ఈ ఏడాది మాత్రం కాస్త స్పీడ్ తగ్గించి సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం ‘కథలో రాజకుమారి, పండగల దిగివచ్చాడు’ వంటి చిత్రాల్లో నటిస్తున్న రోహిత్ మరొక కొత్త చిత్రాన్ని కూడా చక చకా కానిచ్చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ మల్లెల డైరెక్ట్ చేస్తున్నాడు.

ప్రసుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో జరుగుతోంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన రెజినా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో రోహిత్ సరికొత్త గెటప్లో కనిపిస్తాడని వినికిడి. మరోవైపు తన డెబ్యూ సినిమా ‘బాణం’ ను డైరెక్ట్ చేసిన చైతన్య దంతులూరితో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ నారా హీరో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు