శరవేగంగా జరుగుతున్న ‘నారప్ప’ షూటింగ్

శరవేగంగా జరుగుతున్న ‘నారప్ప’ షూటింగ్

Published on Jan 29, 2020 9:10 PM IST

తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వెంకీ, అడ్డాల ఇద్దరూ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేయాలని గట్టిగా వర్క్ చేస్తున్నారు.

ఒకవైపు షూటింగ్ చేస్తూనే ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఎడిటింగ్ కార్యక్రమాలు కానిస్తున్నారట. వీలైనంతవరకు సినిమాను మొదటి అర్థభాగంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నటి ప్రియమణి కథానాయికగా నటిస్తుండగా మణిశర్మ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు