స్నేహితుడి కోసం గెస్ట్ రోల్ చేయనున్న నారా రోహిత్ !

స్నేహితుడి కోసం గెస్ట్ రోల్ చేయనున్న నారా రోహిత్ !

Published on Nov 20, 2017 4:49 PM IST

యంగ్ హీరో నారా రోహిత్ అందరి హీరోలకు భిన్నంగా సరికొత్త తరహా కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. అందుకే ఆయనకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు, ఆదరణ ఉన్నాయి. ఇప్పటికే పలు రకాల జానర్లలో సినిమాలు చేసిన అయన త్వరలోనే తన స్నేహితుడి సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్నారు.

ఆ స్నేహితుడు మరెవరో కాదు శ్రీవిష్ణు. శ్రీ విష్ణు ప్రస్తుతం ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో రోహిత్ కొద్దిసేపు అతిది పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర నిడివి కొద్దిసేపే అయినా కథను మలుపు తిప్పేదిగా ఉంటుందని రోహిత్ స్వయంగా తెలిపారు. ఇంకో విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని రోహిత్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు నాగేశ్వర్ రెడ్డి బొంతల ఎడిటర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు