పెళ్లి కూతురి వేటలో అల్లరి నరేష్

పెళ్లి కూతురి వేటలో అల్లరి నరేష్

Published on Aug 1, 2014 8:50 AM IST

Allari-Naresh

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్ళ కాలంగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న హీరో అల్లరి నరేష్. మినిమం గ్యారంటీ హీరోగా ముద్ర వేసుకుని తనదైన శైలిలో వేగంగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా నరేష్ తెలుగు సినిమాకు సోలో కామెడీ హీరో కాబట్టి ఇప్పుడిప్పుడే తనకి వచ్చే నష్టం లేదు

తాజా సమాచారం ప్రకారం మన అల్లరోడు పెళ్లి కూతురి వేటలో వున్నాడు. తాను ఎవర్ని వివాహం చేసుకువాలి అన్నది తన తల్లిగారి చేతిలో పెట్టాడంట మన అమ్మకూచి. “కొన్ని రోజుల క్రితం మా అమ్మ నా దగ్గరకు వచ్చి మీ నాన్నగారి(ఈ.వి.వి సత్యనారాయణ)కి నీ పెళ్ళిపైనే ఆలోచన వుండేది. నీ పెళ్ళి చేస్తే ఆయన తన పనులన్నీ పూర్తి చేసినట్లు భావించారు. కాబట్టి నీ నిర్ణయం ఏమిటో చెప్పమని” కోరిందని తెలిపాడు. నాన్నగారి మరణ వార్త నుండి మేము కోలుకోలేక పోయామని అందుకే ణా నిర్ణయం తెలిపేందుకు ఆలస్యం అయిందని తెలిపాడు

వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోపు నరేష్ ని పెళ్ళి కొడుకుగా చుడచ్చని సమాచారం. అంతేకాక టాలీవుడ్ లో తనకి చాలా హీరోయిన్ల తో లింక్ లు పెట్టినట్టు వారందరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అయిపోయి వారి భర్తలతో తాను టచ్ లో వున్నట్టు తెలిపి నవ్వుల పువ్వులు పూయించాడు మన సుడిగాడు. ఆల్ ది బెస్ట్ నరేష్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు