భారీ ధరకు అమ్ముడైన అల్లరి నరేష్ సినిమా శాటిలైట్ హక్కులు !

భారీ ధరకు అమ్ముడైన అల్లరి నరేష్ సినిమా శాటిలైట్ హక్కులు !

Published on Jul 23, 2017 12:36 PM IST


ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి సినిమాల్ని చాలా వరకు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలబెట్టిన హీరో అల్లరి నరేష్ కొంత కాలంగా మంచి సక్సెస్ లేక వెనుకబడ్డ సంగతి తెలిసిందే. అందుకే ఈసారి ఖచ్చితమైన హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన చేస్తున్న సినిమా ‘మేడ మీద అబ్బాయి’. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.

ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని రూ.3.5 కోట్లు వెచ్చించి ఈ హక్కుల్ని దక్కించుకుంది. సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్సులో నరేష్ కు ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పటీకీ ఆయన పాత సినిమాలు కొన్ని మంచి టీఆర్ఫీ సాధిస్తూనే ఉన్నాయి. పైగా ‘మేడ మీద అబ్బాయి’ మంచి ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అందుకే హక్కులు ఇంత ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని అనుకోవచ్చు. జి. ప్రజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు డీజే. వసంత్ సంగీతం అందిస్తుండగా ఇందులో నరేష్ సరసన నిఖిల విమల అనే కొత్త హీరోయిన్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు