చిరు హీరోయిన్‌గా నర్గిస్ ఫక్రి?

చిరు హీరోయిన్‌గా నర్గిస్ ఫక్రి?

Published on Jun 26, 2016 1:23 PM IST

Nargis-Fakhri
మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడు మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలవుతుందా అని చాలాకాలంగా చూసిన ఎదురుచూపులకు తెరదించుతూ, ఈ మధ్యే ఆయన తన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక సినిమా సెట్స్‌పైకెళ్ళినా ఇందులో హీరోయిన్‌గా నటించేది ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇదే విషయమై మాకు అందిన సమాచారం మేరకు చిరు హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ నర్గిస్ ఫక్రిని దర్శకుడు వినాయక్ సంప్రదించినట్లు తెలిసింది.

ప్రస్తుతం నర్గిస్ ఫక్రితో పారితోషికం విషయమై చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే, మరోవారంలో ఈ విషయమై టీమ్ నుంచి ఓ అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. చిరంజీవి చాలాకాలం తర్వాత తెరపై కనిపించే సినిమా కావడంతో 150వ సినిమాను అన్నివిధాలా ది బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ కారణంతోనే ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు