‘నరుడా డోనరుడా’ని రెడీ చేస్తోన్న సుమంత్!
Published on Oct 23, 2016 7:05 pm IST

naruda-donaruda
2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ అనే సినిమా తర్వాత ఎలాగైనా బలమైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో కావాలనే సుమంత్ గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ‘నరుడా డోనరుడా’ అనే సినిమాతో వచ్చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాకు రీమేకే ఈ ‘నరుడా డోనరుడా’! ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో ఎక్కడిలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇక తాజాగా టీమ్ ఆడియో విడుదల తేదీని కూడా ప్రకటించేసింది. అక్టోబర్ 27న నరుడా డోనరుడా పూర్తి ఆడియో మార్కెట్‌లోకి విడుదలవుతుందని టీమ్ తెలిపింది. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూర్చారు. సుమంత్ సరసన పల్లవి సుభాష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చి పెద్ద హిట్‌గా నిలుస్తుందని సుమంత్ భావిస్తున్నారు.

 
Like us on Facebook