తమిళనాట పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్న నవదీప్

తమిళనాట పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్న నవదీప్

Published on Apr 1, 2015 11:00 PM IST

Navdeep-Tweet
టాలెంట్ వున్నా విజయం కలిసిరాక సతమతమవుతున్న నటులలో నవదీప్ ఒకరు. జోనర్ తో సంబంధం లేకుండా రకరకాల కధలతో నవదీప్ మనముందుకు వస్తున్నా విజయం మాత్రం అతణ్ణి వరించడంలేదు. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తరువాత తమిళనాట ఒక మరో సినిమా చేయనున్నాడు. నాన్న ఫేం ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ‘ఇదు ఎన్నా మాయం’ అనే చిత్రంలో నటించనున్నాడు.

తమిళంలో ‘అరింతుమ్ అరియమాలమ్’, ‘నెన్జిల్ జిల్ జిల్ ‘, ఏగన్’ సినిమాల ద్వారా సుపరిచితుడే. నవదీప్ తాజా చిత్రం భమ్ భొలెనాధ్ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం అతను నటిస్తున్న నటుడు, అంతసీన్ లేదు సినిమాలు నిర్మాణదశలో వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు