నయనతార ‘అనామిక’ రన్ టైం

నయనతార ‘అనామిక’ రన్ టైం

Published on Apr 23, 2014 12:16 PM IST

Anamika-New-Stills-(4)
సున్నితమైన బావోద్వేగాలతో కూడిన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల రూటు మార్చి చేసిన థ్రిల్లర్ ‘అనామిక’. నయనతార కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో వైభవ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేసారు.

ఈ వేడుకలో శేఖర్ కమ్ముల తనపై ఉన్న కంప్లైంట్స్ పై క్లారిటీ ఇస్తూ ‘ మామూలుగా శేఖర్ కమ్ముల అంటే సినిమా తీయడానికి ఒక సంవత్సరం టైం తీసుకుంటాడు అనే కంప్లైంట్ ఉంది. కానీ ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో కలిపి 60-70 రోజుల్లో షూట్ చేసాం. అలాగే నా సినిమాల రన్ టైం 2:40 నిమిషాలకి తక్కువ ఉండదు, కానీ ‘అనామిక’ రన్ టైం మాత్రం 2:05 నిమిషాలే ఉంటుంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం కోసం చాలా ట్రిమ్ చేసామని’ అన్నాడు.

వయోకామ్ 18 – ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్ – లాగ్ లైన్ పిక్చర్స్ వారు కలిసి నిర్మించిన ఈ సినిమా మే 1 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు