ఎమ్మెల్యేగా కూడా బాలయ్యే నెంబర్ వన్

ఎమ్మెల్యేగా కూడా బాలయ్యే నెంబర్ వన్

Published on Aug 2, 2015 2:15 PM IST

balakrishna

నందమూరి తారక రామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా ఆయన బాటలోనే పయనిస్తూ ప్రజల చేత మన్ననలు అందుకుంటున్నాడు. ఇన్ని రోజులు హీరోగానే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున హిందూపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తన నియోజక ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ తమకు కావలసిన అవసరాలను తీర్చుకుంటున్నాడు. ఇప్పటివరకూ హీరోగా నెంబర్ వన్ అనిపించుకున్న బాలయ్య ఎమ్మెల్యేగా కూడా నెంబర్ వన్ అనిపించుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో టిడిపి ఎమ్మెల్యేల పనితీరుపై జిల్లాల వారీగా సర్వే చేయించి నిశితంగా పరిశీలించారు. ఈ లేటెస్ట్ సర్వేల రిపోర్ట్ ని నిన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు అందించారు.

ఈ రిపోర్ట్స్ ఎమ్మెల్యేలను షాక్ చేసాయి. ఎందుకంటే జిల్లాల వారిగా ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ కి కూడా ఇవ్వడం విశేషం. ఈ సర్వేలో అనంతపూర్ జిల్లాలో నెంబర్ వన్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ అని వెలువరించాయి. హిందూపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడంలో, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చాలా బాగా కృషి చేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. అనంతపురం జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలను అందరినీ అధిగమించి ఫస్ట్ ర్యాంక్ బాలయ్యకి రావడం విశేషం. నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమాలు చేస్తున్నా హిందూప్ర్ నియోజక వర్గాన్ని, తన ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ కోసం ఎప్పుడూ ముందుండి అన్ని పనులు చూసుకుంటున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు