‘కత్తి’లో ఆడియన్స్ ని మెప్పించిన నీల్ నితిన్ ముఖేష్

‘కత్తి’లో ఆడియన్స్ ని మెప్పించిన నీల్ నితిన్ ముఖేష్

Published on Oct 22, 2014 3:30 PM IST

Neil-Nithin-Mukesh_Kaththi

యంగ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ బాలీవుడ్ లో ‘జానీ గద్దర్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పటివరకూ బాలీవుడ్ లో డిఫరెంట్ రోల్స్ చేసిన నీల్ నితిన్ ముఖేష్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ చేసిన మొదటి తమిళ సినిమా ‘కత్తి’. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా, ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘కత్తి’ సినిమా ఈ రోజు విడుదలైంది.

ఈ సినిమాలో నీల్ నితిన్ పెర్ఫార్మన్స్ చాలా బాగుందని, అలాగే సినిమాలో విజయ్ కి తన పెర్ఫార్మన్స్ తో టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడని చెబుతున్నారు. అన్నిటికీ మించి నీల్ నితిన్ ముఖేష్ తన అపాత్రకి తనే ఆన్ డబ్బింగ్ చెప్పాడు అది కూడా సినిమాకి బాగా సెట్ అయ్యిందని అంటున్నారు. ఈ సినిమాకి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నీల్ నితిన్ ముఖేష్ సల్మాన్ ఖాన్ తో పాటు ‘ప్రేమ్ రతన్ ధన్ పయో’ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు