రవితేజ ప్లాన్ లో చిన్న మార్పు !

రవితేజ ప్లాన్ లో చిన్న మార్పు !

Published on Mar 17, 2018 5:12 PM IST

మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం ‘నేల టికెట్’. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. స్వతహాగానే రవితేజకు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండగా ఈ సినిమాకు ‘నేల టికెట్’ అనే టైటిల్ పెట్టడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

ముందుగా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఉగాదినాడు రేపు రీలీజ్ చేస్తారనే వార్త బయటకు రాగా తాజాగా రేపటి దాక అభిమానులను ఎదురుచూసేలా చేయకుండా ఈరోజు సాయంత్రం 7 గంటలకే అనగా ఇంకొద్దిసేపట్లో ఫస్ట్ లుక్ విడుదలకానుంది. మే నెలాఖరున విడుదలయ్యే అవకాశాలున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయకిగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు