‘శతమానం భవతి’ ఆ ఎమ్మెల్యేకు తెగ నచ్చేసింది..!

‘శతమానం భవతి’ ఆ ఎమ్మెల్యేకు తెగ నచ్చేసింది..!

Published on Jan 18, 2017 11:30 AM IST

nellore-mla
డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ ఉండే హీరో శర్వానంద్, తాజాగా ‘శతమానం భవతి’ అన్న సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి రెండు భారీ సినిమాల మధ్యన వచ్చినా కూడా అందరి అంచనాలను అధిగమించి సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలను కోరుకునేవారినుంచి ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇక సాధారణ ప్రేక్షకులు, అభిమానులనే కాక, రాజకీయ ప్రముఖులను సైతం శతమానం భవతి ఆకర్షిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈమధ్యే శతమానం భవతి సినిమా చూశారట. ఇక ఆయనకు ఈ సినిమా తెగ నచ్చడంతో ఏకంగా ఓ ప్రెస్‌మీట్ పెట్టి మరీ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బంధాలు, విలువల గురించి చెప్పిన గొప్ప సినిమా శతమానం భవతి అని, ఇలాంటి సినిమాలకు ప్రభుత్వాలు సైతం పన్ను మినహాయింపును ఇస్తే బాగుంటుందని అన్నారు. సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు