పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ‘నేను లోకల్’..!

పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ‘నేను లోకల్’..!

Published on Jan 22, 2017 6:00 PM IST

nani-nenu-local
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ కొద్దికాలంగా మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ ఎత్తునే ఉన్నాయి. ఫిబ్రవరి 3న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతూ ఉండడంతో టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ చకచకా పూర్తి చేసేస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది.

అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఇప్పట్నుంచే నిర్వహించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. నాని డబ్బింగ్ పూర్తవ్వగానే ప్రమోషన్స్ మొదలుపెడతారు. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్‌ కోసం హైద్రాబాద్ వచ్చేస్తున్నారు. నాని స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు