చివరి దశలో ‘నేను లోకల్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు !

చివరి దశలో ‘నేను లోకల్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు !

Published on Jan 23, 2017 9:49 PM IST

nani-nenu-local
నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నాని తాజాగా ‘నేను లోకల్’ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ విజయాలపై కన్నేశాడు. తాజా సమాచారం ప్రకారం నేను లోకల్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో మిగిలిన కొద్ది పాటి వర్క్ ని నాలుగైదు రోజుల్లో పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలు యువత ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో ఈ చిత్రం పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు