‘సింగిల్ షాట్’ టీజర్‌తో రెడీ అయిన నాని!

nani-nenu-local
‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘మజ్ను’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకొని నాని ఇప్పుడు తెలుగు సినిమాకు ఓ కొత్త స్టార్‌గా అవతరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా నటిస్తోన్న నేను లోకల్ అనే సినిమా డిసెంబర్ నెలాఖర్లో క్రిస్‌మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, తాజాగా రేపు సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ టీజర్‌తో సందడి చేయనున్నారు.

28 సెకండ్ల పాటు ఉండే ఈ టీజర్ సింగిల్ షాట్‌లో తెరకెక్కింది కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇలా సింగిల్ షాట్ టీజర్‌ను విడుదల చేస్తూ టీమ్ ప్రత్యేకత చూపనుంది. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోన్న నేను లోకల్ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

 

Like us on Facebook