ఇదివరకెన్నడూ చూడని ఫైట్ ఎన్టీఆర్ సినిమాలో ఉంటుందట !

ఇదివరకెన్నడూ చూడని ఫైట్ ఎన్టీఆర్ సినిమాలో ఉంటుందట !

Published on May 19, 2018 6:40 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కొద్దిసేపటి క్రితమే విడుదలై విశేషమైన స్పందనను దక్కించుకుంటున్నాయి. టైటిల్ ‘అరవింద సమేత’ త్రివిక్రమ్ స్టైల్లో భిన్నంగా ఉండగా ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో సూపర్ అనేలా ఉంది. సినిమాలోని ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ నుండి ఈ ఫస్ట్ లుక్ ను రూపొందించారు చిత్ర యూనిట్.

ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని, బడ్జెట్ పరంగా, టేకింగ్ పరంగా ఇది వరకు తెలుగు సినిమాల్లో చూడని విధంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఆరంభంలోనే ఈ ఫైట్ ను చిత్రీకరించారు త్రివిక్రమ్. మరి ఈ పోరాట సన్నివేశంలో అంత ప్రత్యేకత ఏమిటి చూడాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. అక్టోబర్ నెలలో విడుదలకానున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకిగా కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు