‘బాహుబలి 2’ తో ఎంట్రీ ఇస్తున్న కొత్త నటి !

‘బాహుబలి 2’ తో ఎంట్రీ ఇస్తున్న కొత్త నటి !

Published on Oct 21, 2016 10:15 AM IST

priya-naidu
ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి 2’ లో అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. సీనియర్ నటులు చాలా మందికే ఆ అవకాశం దక్కలేదు. కానీ ఓ అమ్మాయికి మాత్రం ఆ అవకాశం కష్టపడకుండానే దక్కింది. ఆ అమ్మాయి పేరు ప్రియా నాయుడు. ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ నా కజిన్ నా ప్రొఫైల్ తీసుకుని వాళ్లకు చూపించగా రాజమౌళి గారు ఓ సపోర్టింగ్ రోల్ లో వెంటనే అవకాశమిచ్చారు. సెట్స్ లో కూడా రాజమౌళి గారు, అనుష్క,తమన్నా వంటి పెద్ద వాళ్లంతా వాళ్లతో సమానంగా నన్ను చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.

రాజుగారితో కలిసి బాహుబలి వంటి గొప్ప చిత్రంలో పనిచేయడం నిజంగా నా అదృష్టం అని చెప్పుకొచ్చింది ప్రియా. ప్రియా హైదరాబాద్ లో పుట్టి బెంగుళూరులో పెరిగింది. తరువాత హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది. ప్రసుతం ఈమె కృష్ణ వంశీ తీస్తున్న ‘నక్షత్రం’ లో ఓ సపోర్టింగ్ రోల్ చేస్తోంది. అలాగే శ్రీనివాస అవసరాల హంటర్ సినిమాలో కూడా చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు