కొంత ముందుగానే రిలీజయ్యేలా ఉన్న ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ !
Published on Jan 3, 2018 9:26 am IST

పవన్ కళ్యాణ్ అభిమానులు జనవరి 10న విడుదలకాబోయే ‘అజ్ఞాతవాసి’ సినిమా కోసం ఎంతలా అయితే ఎదురుచూస్తున్నారో, ట్రైలర్ కోసం కూడా అంతే ఆతురతగా వేచి ఉన్నారు. ముందుగా ట్రైలర్ ను జనవరి 5వ టీడీనా రిలీజ్ చేస్తారనే వార్త రాగా ఇప్పుడు ఆ తేదీ కాస్త ముందుకు జరిగి 4వ తేదీన అనగా రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ బయటికొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయమై నిర్మాణ సంస్థ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. పవన్ 25వ సినిమా కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం వహించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ నెలకొన్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సక్సెస్ కాగా టీజర్ కు కూడా మంచి స్పందన దక్కింది. ఇకపోతే చాలా చోట్ల 9వ తేదీ రాత్రి నుండే ప్రీమియర్లు ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 
Like us on Facebook