గోపీచంద్, చక్రి సినిమా మొదలయ్యేది అప్పుడే!

గోపీచంద్, చక్రి సినిమా మొదలయ్యేది అప్పుడే!

Published on Oct 18, 2017 6:30 PM IST

ఆ మధ్య చక్రి దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ‘రాబిన్ హుడ్’ సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా పట్టాలెక్కలేదు. తాజాగా చక్రి ఎన్టీఆర్ లవకుశ సినిమాకు బాబి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసారు.

తాజాగా జైలవకుశ ప్రెస్ మీట్ లో చక్ర్రి, గోపీచంద్తో సినిమా చేస్తున్నట్లు అంగీకరించాడు. చక్రి గతంలో బాబి దగ్గర అన్ని సినిమలకు పని చేసిన అనుభవంతో గోపీచంద్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు, ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. డిసెంబర్ రెండో వారంలో సినిమాను మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. దర్శకుడిగా తోలి సినిమా గోపీచంద్ తో చేస్తున్న చక్రి విజయం సాదించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు