మహేష్ ఫ్యామిలి నుండి మరో హీరో ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. దేవి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. మహేష్ ఫ్యామిలి నుండి సుదీర్ బాబు, మంజుల సినిమా ఇండస్ట్రీ లో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు బావ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా చిత్రసీమకు హీరోగా పరిచయం కాబోతున్నాడని సమాచారం.

ఇప్పటికే అశోక్ గల్లా నటనలో శిక్షణ తీసుకుంటున్నదని, త్వరలో దిల్ రాజు అశోక్ ను హీరోగా పరిచయం చెయ్యబోతున్నాడని టాక్. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ వార్త అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అశోక్ మహేష్ సోదరి పద్మావతి కుమారుడు.

 

Like us on Facebook