రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘కథలో రాజకుమారి’ !


ఈ ఏడాది సెలెక్టివ్ సినిమాల్ని చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన ‘శమంతకమణి’ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఆయన మరొక చిత్రం ‘కథలో రాజకుమారి’ సైతం విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ ప్రమోషన్లు ఆరంభించే దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 25న విడుదలచేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ క్రేజ్ నెలకొంది. ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై కృష్ణ విజయ్, ప్రశాంతి, సౌందర్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ సూరపనేని డైరెక్ట్ చేస్తుండగా నమిత ప్రమోద్ హీరోయిన్ గాను, మరొక యంగ్ హీరో నాగ శౌర్య ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

 

Like us on Facebook