సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సరికొత్త రిలీజ్ డేట్

సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సరికొత్త రిలీజ్ డేట్

Published on Mar 6, 2015 4:01 PM IST

rey

దర్శకనిర్మాత అయిన వైవిఎస్ చౌదరి మెగా ఫ్యామిలీ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘రేయ్’. ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ వాయిదాల పర్వం వల్ల సాయి ధరమ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందు రిలీజ్ అయిపోవడమే కాకుండా సూపర్ హిట్ అయ్యింది. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోతుందని చాలా సార్లు వార్తలు వచ్చాయి.

అనుకున్న దాని ప్రకారమే ఈ సినిమా రిలీజ్ కోసం సరికొత్త రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు.ఈ చిత్ర టీం అనౌన్స్ చేసిన సమాచారం ప్రకారం ఈ సినిమా వారం తోజుల క్రితమే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతే కాకుండా మార్చి 27న గ్రాండ్ గా ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు