గోపీచంద్ హోం బ్యానర్లో రిజిస్టర్ అయిన ‘ముత్యాల ముగ్గు’

గోపీచంద్ హోం బ్యానర్లో రిజిస్టర్ అయిన ‘ముత్యాల ముగ్గు’

Published on Feb 9, 2016 7:24 PM IST

Gopichand
సినిమా తీయడం కంటే ఆ సినిమాకు ఆకర్షణీయమైన టైటిల్ పెట్టడం, దాన్ని మార్కెట్ లో అందరికీ రీచ్ అయ్యేలా చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. మొదట్లో కథాపరంగా టైటిల్స్ పెడుతూ వచ్చినా కాలం మారే కొద్ది టైటిల్స్ పెట్టడంలో రచయితలు, దర్శకులు కొత్త పుంతలు తొక్కారు. ప్రతి ఒక్క దర్శకుడు తమ అభిరుచికి తగ్గట్టు టైటిల్స్ పెడుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో అలనాటి సూపర్ హిట్ సాంగ్స్ ని తీసుకొని రీమిక్స్ చేస్తున్నారు. ఇదే పంథాలో మరికొంతమంది రచయితలూ, దర్శకులు అలనాటి సూపర్ హిట్ మూవీస్ టైటిల్స్ ని వాడుకొని తమ సినిమాలకు క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అలా ఇప్పటికే గీతాంజలి, శంకరాభరణం అనే టైటిల్స్ తో సినిమాలు రీమేడ్ అయ్యాయి. ఇప్పుడు అదే బాటలోనే మరో సూపర్ హిట్ మూవీ టైటిల్ తో మరో సినిమా చేయడానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమానే ‘ముత్యాల ముగ్గు’. సినిమాని కూడా ఓ అందమైన పెయింటింగ్ లా చూపించే లెజండ్రీ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో 1975 లో వచ్చిన సినిమా ముత్యాల ముగ్గు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని భవ్య క్రియేషన్స్ వారు ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేసారు. గోపీచంద్ కి హోం బ్యానర్ అయిన “భవ్య క్రియేషన్స్” వారు “ముత్యాల ముగ్గు” టైటిల్ రిజిస్టర్ చేసి అందరిలో ఆసక్తిని పెంచారు.

ప్రస్తుతానికి ఇందులో ఎవరు నటిస్తున్నారు? దర్శకుడు ఎవరు? అన్న విషయాలు మాత్రం తెలియకపోయినా ఓ మాస్టర్ పీస్ లాంటి సినిమా టైటిల్ తీసుకొని సాహసం చేస్తున్నారని కొందరి అభిప్రాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు