నిఖిల్ కెరీర్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న ‘కార్తికేయ’

నిఖిల్ కెరీర్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న ‘కార్తికేయ’

Published on Oct 22, 2014 8:31 AM IST

Karthikeya
యంగ్ హీరో నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా తెలుగు వెర్షన్ దీపావళి కానుకగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందువలనే ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

నిఖిల్ సూపర్ హిట్ సినిమా అయిన ‘స్వామి రారా’ సుమారు 130 థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పుడు వస్తున్న కార్తికేయ దానికి డబుల్ గా అనగా సుమారు 250కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక్కడ మాత్రమే కాకుండా యుఎస్ లో కూడా ఎక్కువ థియేటర్స్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది అంటే నిఖిల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోతుంది.

ఆంధ్ర – తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు