నిఖిల్ రెండవ సినిమా ఈ దర్శకులతోనే ఉండబోతోందట !

nikhil-kumar
మాజీ ప్రధాని దేవ గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామి తనయుడు నిఖిల్ కుమార్ గౌడ మొదటి సినిమా రిలీజ్ కాకముందే రెండవ సినిమా కోసం దర్శకులను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డాడు. ఎన్నడూ లేని విధంగా పరిచయమే రూ. 75 కోట్ల భారీ బడ్జెట్ సినిమాతో ఇస్తున్న ఈ హీరో కోసం తండ్రి కుమార్ స్వామి తన వంతు కృషి చేస్తున్నారు. కుమారుడి కోసం నిర్మాతగా మారి టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే పనిలో ఉన్నారు.

అందుకోసమే టాలీవుడ్ టాప్ దర్శకులైన తివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పూరి జగన్నాథ్ వంటి వారితో సినిమాలు చేయనున్నాడు. అలాగే తన కుమారుడి రెండవ సినిమాని వీరిలోనే ఎవరో ఒకరితో చేయించాలనే ప్లాన్ లో కూడా ఉన్నాడట. వీటితో పాటు తనకు సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాని నిర్మించాలని ఉవ్విళూరుతున్నాడట కుమార్ స్వామి. సో.. అనుమానం లేకుండా నిఖిల్ గౌడ ఈ టాప్ దర్శకుల్లో ఎవరోఒకరితో తన రెండవ సినిమా చేసే అవకాశముంది. ఇకపోతే ప్రముఖ కథకుడు విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ ‘జాగ్వార్’ చిత్రం అక్టోబర్ 6న రిలీజ్ కానుంది.

 

Like us on Facebook