సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసిన నిఖిల్ !

సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసిన నిఖిల్ !

Published on Feb 28, 2017 6:25 PM IST


వరుస హిట్లతో దూసుకుపోతూ గతేడాది డిసెంబర్లో ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తో అద్దిరిపోయే విజయం నమోదు చేసి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘కేశవ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్స్ ఈ సినిమా కూడా
నిఖిల్ స్టైల్లో పూర్తి వైవిధ్యంగా ఉంటుందని చెప్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మే 12న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. రివెంజ్ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండనుంది. ప్రముఖ కమెడియన్స్ వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్ లాంటి వాళ్లంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు