ఫిలిం కోర్స్ చేయడానికి న్యూయార్క్ వెళ్ళనున్న నిఖిల్

ఫిలిం కోర్స్ చేయడానికి న్యూయార్క్ వెళ్ళనున్న నిఖిల్

Published on Mar 5, 2015 1:56 AM IST

nikhil
హ్యాపీ డేస్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్ద్. ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో స్వామి రారా, కార్తికేయ వంటి భిన్న కథాంశాలతో తనదైన శైలీ లో నిఖిల్ దూసుకుపోతున్నాడు. అయితే తాను కొత్త సినిమాలు ఏవీ చేయడం లేదని, న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో రెండు నెలల పాటు ఫిలిం కోర్సు చేయడానికి న్యూయార్క్ వెళుతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో నిఖిల్ తెలిపారు.

కాగా నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’ మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర విజయం పై నిఖిల్ ధీమాగా ఉన్నారు. ఘట్టమనేని కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన త్రిధా చౌదరి హీరోయిన్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు