మరో సరికొత్త జానర్లో నిఖిల్ నెక్స్ట్ మూవీ

మరో సరికొత్త జానర్లో నిఖిల్ నెక్స్ట్ మూవీ

Published on Nov 24, 2015 4:03 PM IST

nikhil
‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య vs సూర్య’ ఈ మూడు సినిమాల కథలు కానీ, జానర్స్ కానీ ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలు. కానీ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ గా నిలిచాయి. ఈ మూడు సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ మరియు మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ఈ మూడు సినిమాలకి అసలు సంబంధం లేకుండా చేసిన క్రైమ్ కామెడీ సినిమానే ‘శంకరాభరణం’. ఓ కొత్త బ్యాక్ డ్రాప్ ని చూపిస్తూనే పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా తర్వాత కూడా నిఖిల్ కమర్షియల్ అనే జానర్లోకి వెళ్ళకుండా మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో, తను టచ్ చేయని జానర్లో సినిమా చేయడానికే ఇష్టపడ్డాడు. నిఖిల్ – టైగర్’ ఫేం విఐ ఆనంద్ తో కలిసి చేస్తున్న సినిమా ఫాంటసీ జానర్లో ఒక థ్రిల్లింగ్ పాయింట్ తో తెరకెక్కనుంది. తెలుగు ఫాంటసీ అనే జానర్లో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. చాలా రోజుల తర్వాత నిఖిల్ ఫాంటసీ అనే జానర్ కి థ్రిల్లర్ నేపధ్యాన్ని కూడా మిక్స్ చేసి ఫాంటసీ థ్రిల్లర్ గా తన తదుపరి సినిమా చేయనున్నాడు. ముగ్గురు భామలున్న ఈ సినిమాలో తాప్సీ, అవిక గోర్ లని ఇప్పటికే సెలక్ట్ చేయగా మూడవ హీరోయిన్ ని సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు