మిలియన్ మార్క్ ని అందుకున్న నిన్నుకోరి !
Published on Jul 15, 2017 8:30 pm IST

నాని నటించిన నిన్ను కోరి చిత్రం యూఎస్ లో మిలియన్ మార్క్ ని అందకుంది. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న వసూళ్ళని బట్టి ఈ ఫీట్ ని అందుకోవడం చాలా సులభం అని అంటున్నారు.

కాగా నిన్నికోరి చిత్రం అమెరికా బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. దీనితో యుఎస్ ఆడియన్స్ కు ఈ చిత్రం ఇంకా బాగా నచ్చుతోంది. ఈ చిత్ర కథ కొంచెం రిస్క్ తో కూడుకున్నదే. అయినా కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

 
Like us on Facebook