మిలియన్ డాలర్ మార్కుకు చేరువలో ‘నిన్ను కోరి’ !
Published on Jul 10, 2017 5:05 pm IST


నాని నటించిన తాజా చిత్రం ‘నిన్ను కోరి’ ఓవర్సీస్లో బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తోంది. సాధారణంగానే యూఎస్లో నానికి ఉన్న మంచి మార్కెట్ కు తోడు సినిమా కూడా కొత్త తరహా కథతో అక్కడివారిని ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. గురువారం రాత్రి ప్రదర్శించిన భారీ స్థాయి ప్రీమియర్ల ద్వారా సుమారు $383,081 ను కలెక్ష్ చేసిన ఈ చిత్రం శనివారం రాత్రికి మరో $237,000 వసూలు చేసింది. దీంతో శనివారం నాటికి మొత్తం $620,000 రాబట్టింది.

ఇక ఆదివారం వసూళ్లను కూడా కలుపుకుంటే మొత్తం $800,000లుగా ఉంది. ఇంకా కొన్ని ఏరియాల నుండి వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది. వాటన్నిటినీ కూడా కలుపుకుంటే మిలియన్ మార్కుకు చేరువయ్యే అవకాశముంది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 25 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ లెక్కల్ని చూస్తే నాని కేరీర్లోఇదే అత్యుత్తమ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచేలా కనిపిస్తోంది. డివివి దానాయ్య నిర్మించిన ఈ సినిమాను నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు.

 
Like us on Facebook