హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ‘నిన్ను కోరి’ !
Published on Jul 9, 2017 11:15 am IST


నాని తాజా చిత్రం ‘నిన్ను కోరి’ మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నానికి ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఓవర్సీస్లో అయితే ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. గురువారం రాత్రి ప్రదర్శించిన భారీ స్థాయి ప్రీమియర్ల ద్వారా సుమారు $383,081 ను కలెక్ష్ చేసిన ఈ చిత్రం శనివారం రాత్రికి మరో $237,000 వసూలు చేసింది.

దీంతో శనివారం నాటికి మొత్తం $620,000 రాబట్టింది. అంతేగాక ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ. 6.30 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి. ‘ఈగ’ తరవాత నాని కెరీర్లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్స్ కావడం విశేషం. ఇక ఈరోజు ఆదివారం కావడంతో సినిమా వసూళ్లు ఇంకాస్త మెరుగ్గా ఉండే అవకాశాముంది. నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నివేత థామస్, ఆది పినిసెట్టిలు నటించగా డివివి దానయ్య చిత్రాన్ని నిర్మించారు.

 
Like us on Facebook