నితిన్ నెక్స్ట్ సినిమాలోనూ ఇద్దరు స్టార్ హీరోయిన్స్??

నితిన్ నెక్స్ట్ సినిమాలోనూ ఇద్దరు స్టార్ హీరోయిన్స్??

Published on Nov 26, 2015 1:56 PM IST

nithin
చిన్నదానా నీకోసం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలతో ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేకపోయిన యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘అ.. ఆ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రసతుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో అందాల భామలు సమంత, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమానే కాకుండా అతనా తదుపరి సినిమాలో కూడా నితిన్ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడానికి సిద్దపడుతున్నాడు.

అసలు విషయంలోకి వెళితే.. నితిన్ త్రివిక్రమ్ సినిమా తర్వాత వేణు మల్లిడి సినిమాని చేయనున్నాడు. ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారని ఇదివరకే తెలియజేశాం. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కోసం ప్రణిత సుభాష్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ లెక్కన అందరూ ఓకే అయితే నితిన్ మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తాడు. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి చోటా సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు