త్వరలో ప్రారంభంకానున్న త్రివిక్రమ్ – నితిన్ ల సినిమా

త్వరలో ప్రారంభంకానున్న త్రివిక్రమ్ – నితిన్ ల సినిమా

Published on Jul 31, 2015 1:11 AM IST

nithin-trivikram
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా ఖరారైన విషయం తెలిసినదే. సమాచారం ప్రకారం ఈ సినిమాకు సమంతాని హీరోయిన్ గా ఎంపిక చేశారట. సన్నాఫ్ సత్యమూర్తి చితాన్ని నిర్మించిన రాధా కృష్ణ ఈ చిత్రాన్ని కూడా హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ప్రయత్నంలో వున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు