నితిన్ సినిమా కోసం పవన్, త్రివిక్రమ్ కలిశారిలా..!

nithin-pawan-trivikram
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ..’ సినిమాతో తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ కొట్టిన నితిన్, ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా హీరోగా తన స్థాయిని పెంచేవే కావాలన్న ఉద్దేశంతో జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హను రాఘవపూడితో ఓ సినిమా మొదలుపెట్టేసిన ఆయన, తాజాగా మరో క్రేజ్ ప్రాజెక్టును కొద్దిసేపటి క్రితమే మొదలుపెట్టేశారు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్‌తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించనుండడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ మరో నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్వయంగా ఆయనే కథ కూడా అందిస్తూండడం మరో విశేషంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తాను ఎంతగానో అభిమానించే వ్యక్తులని చెబుతూ ఉండే నితిన్, వారిద్దరితో కలిసి పనిచేయనుండడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. రౌడీ ఫెలో అన్న సినిమాతో మెప్పించిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

Bookmark and Share