తరువాతి సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించనున్న నితిన్ !

తరువాతి సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించనున్న నితిన్ !

Published on Jan 17, 2017 3:10 PM IST

nithin
‘అ.. ఆ’ సక్సెస్ తో తన మార్కెట్ రేంజును రెండింతలు చేసుకున్న నితిన్ ఆచి తూచి తన తరువాతి కథను ఎంపిక చేసుకున్నాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ లాంటి భిన్నమైన చిత్రంతో ఒక ప్రత్యేకతను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం యొక్క కథతో పాటు హీరో నితిన్ పాత్ర, ఆహార్యం అన్నీ భిన్నంగానే ఉంటాయట. ఇందులో నితిన్ పాతబస్తీకి చెందిన ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా సరికొత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సినిమా ఈరోజు నుండి రెండవ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో ఒకప్పుడు స్టార్ హీరోగా పేరొందిన నటుడు అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. అమెరికా నైపథ్యంలో నడిచే ఈ కథ కోసం మార్చి నుండి మే వరకు శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గోపిచంద్ ఆంచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు