యూఎస్‌కే ఫిక్స్ అయిన నితిన్ సినిమా!

యూఎస్‌కే ఫిక్స్ అయిన నితిన్ సినిమా!

Published on Dec 4, 2016 4:43 PM IST

nithin-and-hanu-ragavapudi
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, తన కొత్త సినిమాను హీరో నితిన్‌తో చేస్తోన్న విషయం తెలిసిందే. ‘అ..ఆ..’ లాంటి మంచి విజయం తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, హను రాఘవపూడితో ఓ రొమాంటిక్ కామెడీ కోసం జత కట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో పదిరోజుల పాటు హైద్రాబాద్‌లో చిన్న షెడ్యూల్ జరుపుకోనుందట.

ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత యూఎస్‌లో రెండు నెలల పాటు ఓ భారీ షెడ్యూల్ జరగనుందట. వేగాస్, సాన్‌ఫ్రాన్సిస్కో, చికాగోల్లోని కథకు అవసరమైన పలు అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరగనుంది. మొదట యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను నడపాలని భావించినా, చివరకు యూఎస్‍కు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే కెమెరామేన్‌తో కలిసి హను రాఘవపూడి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని వచ్చేశారు. ఫిబ్రవరి నెలలో యూఎస్ షెడ్యూల్ మొదలవుతుంది. మే కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు