మొదలైన పవన్ – నితిన్ ల సినిమా !


యంగ్ హీరో నితిన్ తన ఫెవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణంలో సైన్ చేసిన కొత్త సినిమా ఈరోజే షూటింగ్ ప్రారంభించుకుంది. పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్, పవన్ కు అత్యంత సన్నిహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్టుకు కథను అందించారు.

‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ డైరెక్షన్ చేస్తున్నారు. నితిన్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్. ఎస్ థమన్ సంగీతాన్ని అందివ్వనున్నారు.

 

Like us on Facebook