మల్టీ స్టారర్లో నటించనున్న నితిన్, శర్వానంద్ ?

తెలుగునాట మల్టీ స్టారర్ చిత్రాలకు ఆదరణ పెరిగిన నైపథ్యంలో యంగ్ హీరోలు నితిన్, శర్వానంద్ లు మల్టీ స్టారర్లో నటించేందుకు సిద్దయ్యమయ్యారనే వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథం’ తో ప్రేక్షకులని పలకరించిన దర్శకుడు హరీష్ శంకర్ తన తర్వాతి సినిమాగా మల్టీ స్టారర్ చేయాలనుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టులో నటిస్తారంటూ గతంలో పలువురు హీరోల పేర్లు వినబడినా ఇప్పుడు నితిన్, శర్వానంద్ ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ ఇప్పటికే వారికి కథను వినిపించారని, వాళ్ళు కూడా పాజిటివ్ గానే స్పందించారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తముందో తెలియాలంటే వీరి ముగ్గురిలో ఎవరో ఒకరి నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

 

Like us on Facebook